ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అశ్వాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు రూ. 7. 50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, నాయకులు రామ కృష్ణ, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.