అశ్వాపురం మండలం గొందిగూడెం ఆశ్రమ పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఈయన పల్లి పవన్ సాయి శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత ఉండటం లేదని అన్నారు. హెచ్ఎం హెడ్ కోటర్స్ లో ఉండకుండా పాల్వంచ నుంచి వస్తున్నారని అన్నారు. దీంతో విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా తయారవుతున్నారని అన్నారు. వెంటనే వార్డెన్ పై తగు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు.