కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో యు. ఎస్. పి. సి మరియు జాక్టో ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఒక్కరోజు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. రాబోయే దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని, జీవో 317 ఉపాధ్యాయుల సమస్యలు, సిపీఎస్ రద్దు పలు సమస్యల పరిష్కారానికై చేసినా దీక్షను ఆదివారం నాడు టిఎస్ యు టి ఎఫ్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు భూక్య కిషోర్ సింగ్ నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.