సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం విజయవంతం చేయండి: యుఎస్పిసి

1345பார்த்தது
సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం విజయవంతం చేయండి: యుఎస్పిసి
యు ఎస్ పి సి రాష్ట్ర కమిటి పిలుపు మేరకు భద్రాద్రి ఉపాధ్యాయు సంఘాల పోరాట స్టీరింగ్ కమిటి సమావేశం టి ఎస్ యు టి ఎఫ్ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో పెన్షన్ విద్రోహ దినంలో భాగంగా సి పి ఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని భద్రాద్రి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా స్టీరింగ్ కమిటీ తీర్మానించింది. పెన్షన్ విద్రోహ దినంలో భాగంగా అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేయాలని, అలాగే అదే రోజు సాయంత్రం 4: 30 జిల్లా కేంద్రంలో జరుగు నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని మరియు సెప్టెంబర్ 4వ తేదీన కలెక్టరు కార్యాలయం ముందు జరుగు ఒక్క రోజు నిరాహారదీక్షను విజయవంతం చెయ్యడానికి యు ఎస్ పి సి సంఘ నాయకులు చర్చించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ ముక్తకంఠంతో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. రాజు, టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిలాల్, టిఎస్ యుటిఎఫ్ అధ్యక్షలు కిశోర్ సింగ్, టి ఎస్ యు టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి క్రిష్ణ, టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి రమేష్, టిపిటిఎఫ్ జిల్లా ఉపాద్యక్షులు జొగా. రాంబాబు, టి పి టి ఎఫ్ జిల్లా ఉపాద్యక్షుడు సరియా, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி