మునగ సాగుతో ఎకరానికి లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని, రైతులందరికీ దీనిపై అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాగవుతున్న పంటలు, నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల, కెనాల్ బండ్ ప్లాంటేషన్, చేపల పెంపకంపై కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎంలతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.