చెగువేరా ఉద్యమ స్పూర్తి నేటి తరానికి స్ఫూర్తి అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. బుధవారం విప్లవవీరుడు చేగువేరా 57వ వర్ధంతిని సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ లో నిర్వహించారు. సామ్రాజ్యవాదం ప్రపంచానికి శత్రువు అని, దోపిడి లేని వ్యవస్థ రావాలని, దానికి సాయుధ పోరాటమే మార్గమని విశ్వసించి స్వతంత్ర్య కాంక్ష నెరవేర్చుకున్న వ్యక్తి చేగువేరా అని పేర్కొన్నారు.