జిల్లాలో 1. 50 లక్షల ఎకరాల్లో మునగ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీ ఎంలు, వ్యవసాయాధికారులతో కలెక్టరేట్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. నర్సరీల్లో మునగ, మొరింగా, అజోల్ల, కెనాల్ బండ్ తదితర ప్లాంటేషన్లు పెంచాలని కలెక్టర్ సూచించారు.