ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా. పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న మాటలను నిజం చేసేందుకు పూర్వ విద్యార్థులు ఏదో తమకూ తోచిన భక్తితో 33 ఏళ్ల క్రితం తాము చదువుకున్న పాఠశాలకు సరస్వతీ దేవి విగ్రహం శనివారం నాడు వితరణ చేశారు. స్థానిక సుజాతనగర్ మండలం, సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో 1988-1989 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో శ్రీ శ్రీ శ్రీ సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రధానోపాధ్యా యులు శ్రీనివాసరావు, విద్యా కమిటీ చైర్మన్ కుమారి క్రిష్ణ మరియు సర్పంచ్ క్రిష్ణవేణి, యం పి టి సి శోభారాణి, పాఠశాల సిబ్బందికి, విద్యార్థిని విద్యార్థులకు పూర్వ విద్యార్థుల తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, రెడ్డం తులసిరెడ్డి, వహీదా బెగం, యాదగిరి లక్ష్మి, మిడతనపల్లి లక్ష్మీ, జయరాం రెడ్డి, బివి రాజు, యస్కె ఖాసీం, గుంటి నరెందర్, కొల్లురి నాగేశ్వరరావు, రంగు రమెష్, రాజశేఖర్ రెడ్డి, వెచ్చ శ్రీరాములు, సత్యనారాయణ, పి రాంబాబు, జి వెంకటేశ్వర్లు, లక్ష్మా, డి సత్యనారాయణ, నాగేశ్వరరావు, నాగరాజయస్ రామక్రిష్ణ, బీమా తదితరుల పాల్గొన్నారు.