పండుగలన్నింటినీ జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు అధికారులకు, సిబ్బందికి శనివారం శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యాన్ని చాటుకుంటూ సోదరభావంతో పండుగలన్నింటిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.