ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్ జిల్లాలో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకొంది. 56 ఏళ్ల క్రితం వీరమరణం పొందిన భారత వాయుసేన సైనికుడు మల్ఖాన్‌సింగ్ పార్థివదేహానికి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. 1968లో మల్ఖాన్‌సింగ్ బృందం ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానం ఏఎన్-12 రోహ్‌తంగ్ పాస్ వద్ద ప్రమాదానికి గురైంది. మంచుకొండల్లో నాడు గల్లంతైన మల్ఖాన్‌సింగ్ మృతదేహం.. ఇటీవల ఇండియన్ ఆర్మీకి దొరికింది. బ్యాడ్జి ఆధారంగా ఆయనను గుర్తించారు.