భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కొత్త కాలనీ ఏరియాను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కొత్త కాలనీ వాస్తవ్యురాలు రాజ్యం అభ్యర్థన మేరకు సిసి రోడ్లు, డ్రైన్ల సమస్యను సంబంధింత అధికారులతో మాట్లాడి వెంటనే మంజూరు చేశారు. రెండు మూడు రోజుల్లో ఆ పనుల శంకుస్థాపనకు మరల వస్తానని ఆయన తెలిపారు.