అతిధి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

84பார்த்தது
అతిధి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జాన్ మిల్టన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోటనీ-1, కెమిస్ట్రీ -1, కామర్స్-3, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్-3, ఎకనామిక్స్-1, హిస్టరీ-1, ఇంగ్లిష్-2, పొలిటికల్ సైన్స్-2, జువాలజీ-1, తెలుగు-2లో పోస్టులు ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 12న సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி