చర్ల మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల మల్టీవర్కర్స్ కార్మికులకు ఎంపీడీవో ఈదయ్య ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మిషన్ భగీరథ పైప్లన్లు లీకేజీకి గురైనప్పుడు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు కార్మికులకు అవగాహన కల్పించారు. అలాగే నీటి సరఫరా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కార్మికులకు పలు ముఖ్య సూచనలు చేశారు.