భద్రాచలం నియోజకవర్గంలో అభివృద్ధికి 60 కోట్ల నిధులు ఇవ్వాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ప్రతిపాదనలు అందజేశారు. శుక్రవారం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. భద్రాచలం- వెంకటాపురం వరకు ప్రధాన రహదారి, మరమ్మతులు, ఇతర విషయాలపై చర్చించినట్లు తెలిపారు. అభివృద్ధికి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.