దమ్మపేట: బాధిత కుటుంబానికి లక్ష చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
దమ్మపేట మండలం పార్కలగండి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన కోండ్రు వెంకటేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి శనివారం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.