ప్రముఖ టెక్ కంపెనీ నోకియా లేఆఫ్‌లు ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. గ్రేటర్ చైనాలో నోకియా కంపెనీ 2000 మందిని తొలగించింది. అంతకుముందు ఖర్చులను తగ్గించుకునేందుకు యూరప్‌లో 350 మందిని కంపెనీ తొలగించింది. యూరప్‌లో ఉద్యోగుల తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. అయితే.. చైనాలో ఉద్యోగుల తొలగింపుపై మాత్రం ఏమీ స్పందించలేదు.