చండ్రుగొండ మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. మంగళవారం డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పన చెక్కులను అందచేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 47లక్షల 50 వేల రూపాయలను పనులను ప్రారంభించి విద్యార్థులు పలు ఆట వస్తువులను అందజేశామన్నారు. చండ్రుగొండ 10 పడకల ఆసుపత్రిని రోగులు తాకిడి మరింతగా ఉంటే అవసరమైతే 30 పడకలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు.