అన్నపురెడ్డిపల్లి మండలం రామకృష్ణాపురంకి చెందిన బన్నే చెన్నారావు అనే 5 సంవత్సరాల బాబు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వెంటనే స్పందించి హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు అవసరం అయ్యే డబ్బులను వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ప్రభుత్వం ద్వారా 4 లక్షలు మంజూరు చేయించి శుక్రవారం ఎల్ఓసి చెక్కును అందజేశారు.