అన్నపురెడ్డిపల్లి గురుకుల బాలిక పాఠశాలలో పోలీసులు అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఏఎస్ఐ అంజయ్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులను క్లిక్ చేయోద్దని చెప్పారు. అపరిచిత వ్యక్తులు ఫ్రెండ్ రిక్వస్ట్ పంపితే యాక్సెప్ట్ చేయోద్దన్నారు. వ్యక్తిగత వివరాలను వెల్లడించవద్దని కోరారు.