అశ్వారావుపేట నియోజకవర్గంలో కొత్త రహదారుల నిర్మాణానికి, కొన్ని రహదారుల అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 51కోట్లతో ప్రతిపాదనలను శాసనసభ్యుడు జారే ఆదినారాయణ శుక్రవారం సచివాలయంలో అందజేశారు. గండుగులపల్లి నుంచి గోపాలపురానికి 16 కోట్లు, అచ్యుతాపురం క్రాస్‌రోడ్డు-మద్దికొండ-మల్కారం-మీదుగా దమ్మపేట శివాలయం వరకు 13 కోట్లు, నారాయణపురం-గుమ్మడవల్లి, తదితరాలతో ప్రతిపాదనల లేఖ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.