సామాన్యుల సమస్యలపైన జనసేన పార్టీ దృష్టి

1310பார்த்தது
సామాన్యుల సమస్యలపైన జనసేన పార్టీ దృష్టి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం కమలాపురం పంచాయితీలో చేలమన్నగర్ గ్రామంలో కుటుంబ అవసరాల నిమిత్తం మడకం రవి పది సంవత్సరాల వయసులో ఉపాధి కోసం వెళ్లి లారీ క్లీనర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది. అటువంటి మడకం రవికి గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి కుడి కాలు విరగడంతో కాలు లో స్టీల్ రాడ్డు వేసి ఇంటికి పంపడం జరిగింది. అటువంటి రవికి ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ లేదు. ఆధార్ కార్డ్ లేకపోవడం తదుపరి వైద్యం కోసం ఏ హాస్పిటల్ కు వెళ్ళిన వైద్యం చేయమని చెప్పడం జరిగింది. ఈ సమస్య జనసేన పార్టీ దృష్టికి రావడంతో మండలంలో వున్న ఆధార్ సెంటర్ కు తీసుకువెళ్ళి దరఖాస్తు చేయడం జరిగింది. ఈ విధంగా నెల రోజులు గడిసిన ఆధార్ కార్డ్ రాకపోవడం తో ఆధార్ కాల్ సెంటర్ 1947 కు ఫోన్ చేయగా వారు తిరస్కరించబడింది అని చెప్పడంతో ఈ విషయాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే అయినా మచ్చా నాగేశ్వరరావు మరియు మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

స్పందించిన ప్రసాద్ రావు మండలంలో ఉన్న తాసిల్దార్ కి ఫోన్ చేయగా ఓటర్ గుర్తింపు కార్డు కార్డ్ జిరాక్స్ ఇవ్వడం జరిగింది. రెండవసారి కూడా ఆధార్ కార్డ్ కోసమని ఆధార్ సెంటర్ వద్ద దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మళ్లీ 20 రోజులు తర్వాత ఆధార్ కాల్ సెంటర్ కు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఆధార్ కార్డ్ తిరస్కరించబడినది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా జరగడంతో మడకం రవి మనస్థాపానికి గురై రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. మరల ఈ విషయాన్ని జనసేన పార్టీ దృష్టికి రావడంతో జిల్లా కలెక్టర్ కి ఈ విషయాన్ని చెప్పి పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ తరఫున కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు ఆర్డీవోని పిలిచి ఈ సమస్యను పరిష్కరించవలసినదిగా ఆర్డర్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, జిల్లా నాయకులు గొల్ల వీరభద్రం, గరిక రాంబాబు, మండల నాయకులు పొడిచేటి చెన్నారావు, కందుకూరి వినీత్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி