కమలాపురంలో ప్రధాన రహదారి పై వరద నీరు

9922பார்த்தது
భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి మండలం కమలాపురంలో రాత్రి చిన్నపాటి వర్షం కురవడంతో కమలాపురంలో ఆశ్రమ హై స్కూల్ ల్ ను ఆనుకొని ఒక వాగు ప్రవహిస్తుంది. గత కొంత కొన్ని సంవత్సరాలుగా వర్షం కాలంలో వరద నీరు ఉదృతంగా బ్రిడ్జిపై నుంచి ప్రవహించటం జరుగుతుంది. దీనివలన విద్యార్థులకు కు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గిరిజన సంక్షేమ నిధి నుంచి విద్యార్థుల సౌకర్యార్థం పక్కన మరో వంతెన నిర్మించడం జరిగింది.

కానీ ఆ వంతెన నిర్మాణం ముందస్తు ప్రణాళిక లేకుండా నిర్మించడం జరిగింది. దానివలన ఈరోజు రాత్రి వర్షం కురవడంతో వంతెనపై నా వరద నీరు ప్రధాన రహదారిపై నడుము లోతు నీరు ఉన్నాయి. ఈ విషయంపై గతంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరపున సంబంధిత కాంట్రాక్టర్ ను ప్రశ్నించగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా నిర్వహించడం జరిగింది. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. వారు ఈ విషయాన్ని చూసి చూడనట్టు వ్యవహరించారు. కావున ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరపున డిమాండ్ చేస్తున్నామని విద్యార్థి విభాగం నాయకులు గొల్ల వీరభద్రం డిమాండ్ చేయడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி