కౌటాల: ధమ్మచక్ర పరివర్థన్ దివస్ ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్తులు

71பார்த்தது
కౌటాల: ధమ్మచక్ర పరివర్థన్ దివస్ ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్తులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవేల్లి గ్రామంలో విజయదశమి సందర్బంగా జరుపుకునే ధమ్మచక్ర పరివర్థన్ దివస్ కార్యక్రమానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గురువారం వీరవేల్లి గ్రామ బౌద్ధ సంఘం నాయకులు సిద్దం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ పెరిగిన మొక్కలను తొలగించి, విగ్రహానికి రంగులు వేయడం జరిగిందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో యువకులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி