కాగజ్‌నగర్‌లో గత 45 రోజుల నుండి ఇసుక సప్లయ్ లేకపోవడంతో తాము ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భవన నిర్మాణ కార్మీకులు ఆరోపిస్తున్నారు. శనివారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తమకు ఉపాధి కల్పించేందుకు తగుచర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమస్యలను వివరుస్తు వినతిపత్రం అందజేశారు.