కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన దివ్యాంగుల సదస్సులో
వికలాంగుల సంఘాల జిల్లా అధ్యక్షులు అనిల్ కోసన్ కార్ మాట్లాడుతూ, ఆర్టిసి వారి ఆధ్వర్యంలో రాయితీపై దివ్యాంగులకు బస్ పాస్ మేళాను జులై 1వ తేదిన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, రెండు ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ తమ వెంట తీసుకురావాలని కోరారు.