రోడ్డు లేక, అంబులెన్స్ రాక ఇబ్బంది పడుతున్న లింగాపూర్ ప్రజలు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చోర్ పల్లి గ్రామం, భీమాన్ గొంది అనే ఊరులో 32 కుటుంబాలు ఉంటున్నాయి. గత 70 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు.కానీ, వారికి రోడ్డు సౌకర్యం గాని, మరి ఏ ఇతర సౌకర్యాలు గాని లేవని గ్రామ ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రోడ్డు మరియు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.