రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావిశ్వాసం కోల్పోయింది తిరుగుబాటు రాబోతోందని బీజేనీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని అన్నారు.