కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో నెలల తరబడి డ్రైనేజీలను గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు గురువారం తెలిపారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం ఉండటంతో కాలువల్లో ఎక్కడికక్కడ మురుగునీరు పేరుకు పోతోందని కాలనీవాసులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కంపు కొడుతున్న డ్రైనేజీలను శుభ్రం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.