సింగరేణి స్కూల్ విద్యార్థులు పదవ తరగతిలో ఈ విద్యా సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని బెల్లంపల్లి ఏరియా జిఎం ఎం శ్రీనివాస్ అన్నారు. శనివారం కొమురం భీం జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటిలోని సింగరేణి స్కూల్ ను ఆయన సందర్శించారు. విద్యార్థులు, ఉపాద్యాయుల సంఖ్య ను తెలుసుకున్నారు. వసతులను పరిశీలించారు. సౌకర్యాలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు.