ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కక్షిదారులతో దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. వివిధ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా 42 దరఖాస్తులు వచ్చాయన్నారు. అధికారులు సమన్వయంతో ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలని తెలిపారు.