బీసీ కుల గణనలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లోని రోజ్ గార్డెన్ లో బీసీ కుల గణన కార్యచరణ ప్రణాళికలో భాగంగా శనివారం నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, కాంగ్రెస్ నాయకులు శ్యామ్ నాయక్ వర్గీయుల మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు అదుపు చేస్తున్నారు.