AP: వీసా రాలేదని భార్యను పుట్టింటికి పంపించిన ఘటన గుంటూరు జిల్లా ఆరమండ గ్రామంలో వెలుగు చూసింది. ఆరమండకు చెందిన మొగలాయిబాబుతో కట్టెంపూడికి చెందిన మౌళికకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే వీరు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతని వీసా రిజెక్ట్ అయింది. భార్యను ఆస్ట్రేలియాకు పంపించి డిపెండింగ్ వీసాపై వెళ్లాలనుకున్నాడు. కానీ మౌళిక వీసా పరీక్షలో అర్హత సాధించలేకపోవడంతో ఆమెను పుట్టింటికి పంపించాడు. నేడు భర్త ఇంటి ముందు మౌళిక నిరసన తెలిపింది.