చదువుకు పేదరికం అడ్డుకాదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్లగొండ గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం కొమ్ముగూడకు చెందిన దుర్గం అశోక్ మున్నాభాయ్ దంపతుల కుమార్తె శ్రీ తేజకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రూ. 50 వేల చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు వారు కృతజ్ఞతలు తెలిపారు.