భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మల్రాజు రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పసుపులేటి మల్లేష్, మండల మధుకర్, సచిన్ జైస్వాల్ శ్రీకాంత్, రమేష్, మహేష్, రాజేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.