ప్రతి రోజూ కివీ పండు తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కంటి ఆరోగ్యానికి కివీ పండు చాలా మంచిదంటున్నారు. కివిఫ్రూట్‌లో ఉండే విటమిన్లు, కెరోటినాయిడ్స్ కంటి వ్యాధిని నివారించడానికి మొత్తం కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయని తెలియజేస్తున్నారు. కివీలో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మలబద్ధకం, అనేక రకాల జీర్ణశయాంతర సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు.