అఖిల భారత కమ్యూనిస్టు మహాసభలను ఈసారి ఖమ్మంలో నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఆదివారం ఇల్లెందులో నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి సాబీర్పాషాతో కలిసి ఆయన మాట్లాడారు. పార్టీలో చేరిన మున్సిపల్ వైసఛైర్మన్ బాస శ్రీనివాస్, రెంటాల సదానందం, కేవోసీ మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే స్వాగతం పలికారు. చుంచు పల్లిలో సీపీఐలో చేరిన వారికి కండువా కప్పారు.