మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల బదిలీ

79பார்த்தது
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల బదిలీ
కారేపల్లి మోడల్ స్కూల్ నుంచి ఒకేసారి ప్రిన్సిపాల్ ఎండీ. అక్తర్ తో పాటు 18మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు అందాయి. కారేపల్లిలో మోడల్ స్కూల్ ను 2013లో ప్రారంభించగా, 11ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు బదిలీ కావడం గమనార్హం. కాగా, కారేపల్లి మోడల్ స్కూల్లో ఏటా పదో తరగతి విద్యార్థులు సత్తా చాటుతుండగా, బాసరలో ట్రిపుల్ ఐటీలో పలువురు సీట్లు సాధిస్తున్నారు.

தொடர்புடைய செய்தி