కారేపల్లి మండలంలోని ఉసిరికాయలపల్లిలో కొలువుదీరిన శ్రీ కోటమైసమ్మతల్లి జాతర దసరా నుంచి బుధవారం వరకు కొనసాగింది. ఈసందర్భంగా హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం దేవాదాయ శాఖ అధికారి అనిల్ కుమార్ పర్యవేక్షణలో లెక్కించారు. ఆరు హుండీల్లో కలిపి రూ. 7, 03, 006 ఆదాయం నమోదు కాగా, గత ఏడాదితో పోలిస్తే రూ. 7వేలు అదనమని ఈఓ వేణుగోపాలాచార్యులు తెలిపారు. కాగా, ఈనెల 21వ తేదీ వరకు భక్తుల రద్దీ ఉంటుందన్నారు.