తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా కారేపల్లికి చెందిన భూక్య చందునాయక్ ను నియమిస్తూ ఛైర్మన్ చీమ శ్రీనివాస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు గిరిజన బంజారా సామాజిక వర్గానికి చెందిన చందునాయక్ కారేపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడుగా పని చేశారు. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకుగా పాల్గొన్నారు.