కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 15 దివ్యాంగ కుటుంబాలకు.. శుక్రవారం బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు ఎస్ కే గౌసుద్దీన్ బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసరాలతో పాటు దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సమస్యలు ఉన్నవారికి, నిరుపేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు తనకు చేతనైనంత మేర ఆర్థికంగా, వస్తు రూపేణా వారికి ఏదో ఒక రకంగా సహాయం చేస్తున్నానని తెలిపారు.