కల్లూరు మండల కేంద్రంలోని 11కేవీ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని స్థానిక ఏఈ వెంకట్ తెలిపారు. కల్లూరు వన్ టౌన్ పరిధిలో మధిర రోడ్డు, తిరువూరు క్రాస్ రోడ్, నారాయణపురం గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.