ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందటంతో భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ చేసి ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త. చనిపోయిన భార్య చేయి, తన చేయి, తన కూతురి చేయితో హ్యాండ్ కాస్టింగ్ తయారీ చేశాడు. పెనుబల్లి మండలం ఎడ్ల బంజరకు చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ ప్రేమించుకుని 2006లో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన భార్య పద్మశ్రీ విజయవాడలో చికిత్స పొందుతూ మృతి చెందింది.