సుబ్లేడు గ్రామంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ పాలేరు నియోజకవర్గ జేఏసీ సంఘాల అధ్యక్షుడు మందడి ఇజ్రాయిల్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి (దరఖాస్తు) లేఖను రిజిస్టర్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ బాద్ మూడు పట్టణ కేంద్రాలకు సమాన దూరంలో కేంద్ర బిందువుగా ఉన్న సుబ్లేడు గ్రామం కాకతీయ కాలంలోనే రెవిన్యూ పిర్కగా, వాణిజ్య, పరిపాలన కేంద్రంగా కొనసాగింది అన్నారు.