రైతు భరోసా ఇవ్వమని చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం నేలకొండపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విఫలమైందని, రైతు భరోసా విషయంలో మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.