పైనంపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో సుమారు రూ. 30 లక్షల రుణాలను జిల్లా సహకార బ్యాంక్ సీఈఓ వసంతరావు పంపిణీ చేశారు. మంగళవారం నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో నూతన పాస్ బుక్ పొందిన సొసైటీ రైతులకు రుణాలు అందించారు. రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేలకొండపల్లి బ్రాంచ్ మేనేజర్ ఇందు, సూపర్వైజర్ నాగ ప్రసాద్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.