నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హైవే నిర్మాణ పనుల్లో భాగంగా గ్రామంలో రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ఇళ్లను హైవే అధికారులు జెసిబిలతో కూల్చివేస్తుండడంతో హైవే అధికారులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న హైవే ఉన్నత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రభుత్వ స్థలంలో ఉన్న నిర్మాణాలనే కూల్చివేస్తామని చెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.