విద్యుత్ అంతరాయాలు ఎదురుకావొద్దు: డిప్యూటీ సీఎం

80பார்த்தது
భారీ వర్షాల నేపథ్యాన విద్యుత్ అంతరాయాలు ఎదురుకాకుండా చూడాలని, ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్ఈలు, డీఈఓలతో మధిర నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నీట మునిగిన సబేస్టేషన్ల వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, దెబ్బతిన్న స్తంభాలు, ఇన్సులేటర్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி