పాల్వంచ: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
ఓ వ్యక్తి అదృశ్యంపై పాల్వంచ పోలీస్ స్టేటష్ లో ఆదివారం కేసు నమోదైంది. రాజాపురం గ్రామానికి చెందిన మధుసూదన్ ఈనెల 10న సరకుల కోసమని ఇంటిలో నుంచి బయటకు వెళ్లారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు బంధుమిత్రుల ఇళ్లలో వెతికారు. అయినా జాడ లేకపోవడంతో ఎస్సై సురేశ్‌కు ఫిర్యాదు చేశారు.