జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో బుధవారం నుండి తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా తీర్చిదిద్ది ఎంగిలి పూల బతుకమ్మలో పాల్గొని బతుకమ్మ పాటలతో కోలాటాలు ఆడుతూ సంబరాలు చేశారు. ఆడపడుచులకు చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రౌండ్, లైటింగ్, సౌండ్ సిస్టం, వాటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి అందరినీ మైమరిపించారు.