ప్రసాదం తయారీలో జరిగిన అపచారానికి నిరసన

62பார்த்தது
తిరుమల లడ్డు ప్రసాద తయారీలో జరిగిన అపచారానికి నిరసనగా కొత్తగూడెంలో సనాతన హిందూధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గణేశ్ టెంపుల్ నుండి విద్యానగర్ కాలనీ వరకు శనివారం మహాప్రదర్శన నిర్వహించారు. మహాప్రదర్శనలో వివిధ హిందు సంఘాల నాయకులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామి యొక్క తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం అపచారం అన్నారు. ఇది సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే అన్నారు.

தொடர்புடைய செய்தி